ఉత్తమ్‌వి ఉత్త మాటలే...
27-05-2024 01:52 AM
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): పౌరసరఫరాల శాఖలో వందల కోట్ల కుంభకోణం వాస్తవమని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వెల్లడించిన అంశాల్లో అన్ని ఉత్త మాటలే ఉన్నాయని ఆరోపించారు. ఆధారాలతో సహా తాను సంధించిన 19 ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేయడంతోనే ఉత్తమ్ డొల్లతనం బయటపడిందని ఎద్దేవా చేశారు. ఈ అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం వెల్లడిస్తానని తెలిపారు.






