12 March, 2026 | 6:47 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరా పునరుద్ధరణ

21-01-2025 01:11 AM

పెండింగ్ బిల్లులు, ధరల సవరణకు ప్రభుత్వం హామీ : యూబీఎల్

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): బీరు ప్రియులకు యూనైటెడ్ బ్రూవరీస్ సంస్థ చల్లని కబురు చెప్పింది. కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరా పునరుద్ధరించనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు, ధరలను సవరించడం లేదంటూ.. ఈ నెల 8 నుంచి కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరాను ఆ సంస్థ నిలిపివేసింది.

ఈ క్రమంలో ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరించింది. యూబీఎల్ కోరిన విధంగా బీర్ల ధరలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. దీంతో కింగ్‌ఫిషర్ బీర్లు ఇక మార్కెట్‌లోకి రావనే ప్రచారం జరిగింది.

ఆ తర్వాత ప్రభుత్వం, యూబీఎల్ కంపెనీ మధ్య చర్చలు జరిగాయి. పాత బకాయిల చెల్లింపు, బీర్ల ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్టు యూబీఎల్ వెల్లడించింది.

బీర్ల సరఫరాలో 69 శాతం వాటా యూబీఎల్ కింగ్‌ఫిషర్‌తోపాటు ఏడు బ్రాండ్ల బీరు సరఫరా ఆగిపోయిన విషయం తెలిసిందే. బీర్ల సరఫరాకు లైన్‌క్లియర్ కావడంతో కింగ్‌ఫిషర్ బీర్ అభిమానులకు ఊరట లభించిందని చెబుతున్నారు. గత రెండేండ్ల నుంచి రూ.702 కోట్ల వరకు బకాయిలు రావాలని సంస్థ పేర్కొంది.