24 June, 2026 | 5:06 PM

రెండో రౌండ్‌కు కిరణ్ జార్జి

07-11-2024 12:00 AM

ఇస్కాన్ సిటీ (కొరియా): భారత స్టార్ షట్లర్ కిరణ్ జార్జి కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. బుధవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో కిరణ్ 15-21, 21-12, 21-15తో వియత్నాం స్టార్ కువాన్ లిన్ కుయోను మట్టికరిపించాడు. ఈ టోర్నీలో భారత్ నుంచి కిరణ్ జార్జి మాత్రమే బరిలో నిలిచాడు. ఇక రెండో రౌండ్‌లో కిరణ్ చి యూ జెన్‌తో తలపడనున్నాడు.