కేసీఆర్‌ను జైల్లో పెడతానన్న రేవంత్ — ఇప్పటివరకు ఏం చేశారు?
న్యూఢిల్లీ: లోక్ సభలో కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Lift Irrigation Project) అంశంపై బీఆర్ఎఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి(Union Minister Kishan Reddy) మధ్య వాగ్వాదం జరిగింది. సీఆర్ పాటిల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్ పాటిల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సురేశ్ రెడ్డి కోరారు. సురేశ్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని నిపుణుల కమిటీ చెప్పిందని కిషన్ రెడ్డి(Kishan Reddy) సూచించారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ కుటుంబం ఒక ఏటీఎంగా వాడుకుందని ఆరోపించారు. ఇంజినీర్లను కూడా అడగకుండా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని విమర్శించారు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. కేసీఆర్ ను జైళ్లో పెడతానన్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇప్పటి వరకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఆనాడు ఏడు మండలాలు విలీనానికి కేసీఆర్ ఒప్పుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. విలీనం తర్వాత కూడా కేసీఆర్ సోనియాగాంధీ ఇంటికి వెళ్లారని సూచించారు.




