సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్: రైల్వే స్టేషన్ల వద్ద రోడ్ల విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు విస్తరణ కోరుతూ కిషన్ రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద రోడ్లు ఇరుకుగా ఉన్నాయని తెలిపారు. ఎఫ్ సీఐ గోదాం నుంచి స్టేషన్ వరకు రోడ్డు విస్తరించాలని కోరారు. పార్కింగ్ కోసం స్టేషన్ వద్ద సుమారు 5 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. నీటి కనెక్షన్ కోసం డబ్బులు ఇచ్చినా.. పని ఇంకా పూర్తి కాలేదన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)ను కేంద్రం కొత్తగా అభివృద్ధి చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వేస్టేషన్ వద్ద రోడ్లు ఇరుకుగా ఉన్నాయన్నారు. అల్ఫా హోటల్ నుంచి బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ చేయాలన్నారు. మీరు ఆదేశాలు ఇచ్చినా రోడ్డు విస్తరణ పనులు ఇంకా మొదలు కాలేదన్న కేంద్రమంత్రి రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






