నిపుణుల కమిటీతో జస్టిస్ పీసీ ఘోష్ భేటీ
13-06-2024 12:30 PM
హైదరాబాద్: నిపుణుల కమిటీతో జస్టిస్ పీసీ ఘోష్ గురువారం సమావేశమయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను నిపుణుల కమిటీ పరిశీలించింది. పరిశీలన అంశాలను జస్టిస్ పీసీ ఘోష్ కు నిపుణుల కమిటీ వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడ ఏం జరిగింది? ఎలా చేశారు? ఎవరెవరు ఉన్నారు? ఎంత నష్టం జరిగింది? అనే సమాచారమంతా స్పష్టంగా తెలియాలంటే సరైన ఆధారాలు కావాలని, ఆ ఆధారాల కోసమే అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశిస్తున్నామని ఈ ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ తెలిపింది.






