calender_icon.png 15 November, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ సివిల్స్ అభ్యర్థి మృతిపై కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి

28-07-2024 06:09:36 PM

హైదరాబాద్: ఢిల్లీలో వరదనీరు శనివారం రాత్రి బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ఓల్డ్ రాజిందర్ నగర్ లో సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వరదనీరు రావడంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు నీటిలో మునిగి మృతిచెందారు. మృతుల్లో ఒకరు తెలంగాణలోని సికింద్రాబాద్ వాసి తానియా సోనీగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో సికింద్రాబాద్ సివిల్స్ అభ్యర్థి మృతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి తానియా సోనీ తండ్రి విజయ్ కుమార్ కి కిషన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. సోనీ మృతదేహాన్ని త్వరగా సికింద్రాబాద్ చేరుస్తామని హామీ ఇచ్చారు. శనివారం రాత్రి వరదలతో ఢిల్లీలో సికింద్రాబాద్ అభ్యర్థి సోనీ మరణించారు.