calender_icon.png 15 November, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైపాల్ రెడ్డికి పదవులతో గౌరవం రాలేదు.. పదవులకు గౌరవం వచ్చింది

28-07-2024 06:49:39 PM

నాగర్ కర్నూల్: కల్వకుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించారు. బీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత సూదిని జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాసమస్యల పరిష్కారంలో కల్వకుర్తి ప్రజాప్రతినిధులకు ప్రత్యేకత ఉందన్నారు. కల్వకుర్తి ప్రజాప్రతినిధుల్లో దివంగత జైపాల్ రెడ్డి నేర్పించిన విలువలు కనిపిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. 

2014లో సీఎంగా జైపాల్ రెడ్డిని ప్రకటించి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదన్నారు.  కానీ జైపాల్ రెడ్డికి పదవులతో గౌరవం రాలేదు.. జైపాల్ రెడ్డి వల్లే పదువులకు గౌరవం వచ్చిందని ఆయన తెలిపారు. కల్వకుర్తి ప్రజలతో వాదించి గెలవడం కష్టమని, ప్రజాసమస్యల పరిష్కారంలో కల్వకుర్తి ప్రజాప్రతినిధులకు ప్రత్యేకత ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తల్లిని చంపి బిడ్డను కాపాదారు అని ప్రధాని మోదీ ఆరోపణ చేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేక తెలంగాణ ప్రాధాన్యతను జైపాల్ రెడ్డి వివరించారన్నారు.

కల్వకుర్తిని అభివృద్ధి చేస్తామని ఎన్నికల సభలో చెప్పినట్లు ఈ సందర్భంగా సీఎం మరోసారి గుర్తు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్, రూడ్ల కోసం రూ. 180 కోట్లు, నిరుద్యోగితను పారదోలడానికి స్కిల్ సెంటర్ ఏర్పాటు, ఆమన్ గల్ లో డిగ్రీ కళాశాల, మాడుగుల మండల కేంద్రంలో అండర్ డ్రైనెజీ వ్యవస్థ ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలో బీటీ రోడ్లు, కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కు నాలుగు లైన్ల రహదారి, నేను చదివిన తాండ్ర ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేస్తా అని సీఎం చెపారు.