భారత మహిళల క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్
18-03-2026 12:18 AM
బీసీసీఐ నుంచి జీవితసాఫల్య పురస్కారం అందుకున్న భారత మహిళల క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్‌కు ఆమె కోచ్ ఆర్‌ఎస్‌ఆర్ మూర్తి అభినందనలు తెలిపారు. ప్రపంచ మహిళల క్రికెట్‌లో మిథాలీది ప్రత్యేక స్థానమని, భారత్‌లో ఎంతోమంది అమ్మాయిలు ఆమె స్ఫూర్తితోనే క్రికెట్‌లోకి అడుగుపెట్టారని గుర్తు చేశారు. 22 ఏళ్ల 274 రోజుల సుధీర్ఘ కెరీర్ మరెవరికీ సాధ్యం కాలేదని, మిథాలీ సాధించిన రికార్డులకు బీసీసీఐ అత్యున్నత సత్కారం ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు.




