మద్యం తాగితే స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలంటూ కత్తితో దాడి
27-06-2024 11:12 AM
జగిత్యాలలో మద్యం తాగితే స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలంటూ కత్తితో దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రలో జరిగింది. ఓ వైన్స్ వద్ద ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. మద్యం సేవించేందుకు వచ్చి పర్మిట్ రూంలో మద్యం సేవిస్తూ స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలంటూ దాడికి పాల్పడ్డారు. డబ్బులివ్వాల్సిందేనని పర్మిట్ రూమ్ నిర్వాహకుడు కోరటంతో దాడికి దిగిన సామల్ల శేఖర్ అనే వ్యక్తి, నేను లోకల్ నన్నే డబ్బులడుగుతావా అంటూ చితకబాదాడు. ఈయనకు వంతనే వ్యక్తి సైతం పక్కనే ఉన్న వ్యక్తి కత్తితో బెదింటించి దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.






