22 April, 2026 | 1:09 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

డిటిడిఓ కార్యాలయ ఉద్యోగి కక్కుర్తి.!

27-06-2024 11:29 AM

నాగర్ కర్నూల్, విజయ క్రాంతి: డిటిడిఓ కార్యాలయ ఉద్యోగులు కక్కుర్తి పడ్డాడు. విద్యార్థులకు అందించాల్సిన ఇంగ్లీష్ మీడియం పాఠ్యపుస్తకాలను పాత సామాగ్రి దుకాణానికి అమ్ముకొన్నారు. పాత సామాగ్రి దుకాణంలో ఉన్న పాఠ్యపుస్తకాలను చూసినా కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదంతం బయటకు వచ్చింది.

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఉట్ల కోనేరు సమీపంలోని ఓ పాత ఇనుపసామను దుకాణంలో గత విద్యాసంవత్సరానికి సంబంధించిన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు సీలు కూడా తీయకుండా ఉండటం గమనించిన కొందరు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.గురువారం 45 కట్టల పాఠ్య పుస్తకాలను పోలీసులు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డీటీడీవో) కార్యాలయ ఉద్యోగి శంకర్ వాటిని విక్రయించినట్లు దుకాణ యజమాని ద్వారా ప్రాథమికంగా తెలిసింది.  డీటీడీవో కమలాకర్రెడ్డిని వివరణ కోరగా కింది స్థాయి సిబ్బంది తప్పిదం వల్లే ఇలా జరిగిందంటూ చేతులు దులిపేసుకునే విధంగా సమాధానం ఇవ్వటం గమనార్హం.