23 August, 2026 | 6:52 PM

Breaking News

నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వివాదాన్ని వెంటనే పరిష్కరించాలి   •  

ఐమాక్స్ వద్ద లాయర్‌పై కత్తులతో దాడి

13-11-2024 12:28 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): సచివాల యానికి కూతవేటు దూరంలో ఉన్న ఐమాక్స్ థియేటర్ వద్ద కళ్యాణ్ అనే లాయర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం కత్తులతో దాడిచేశారు. ఉదయం ఐమాక్స్ థియేటర్ వద్ద కళ్యాణ్ వాకింగ్ చేస్తుండగా రాంగ్‌రూట్‌లో బైక్‌పై వచ్చిన వ్యక్తులు ఆయన పై హత్యాయత్నం చేశారు. అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను లాక్కొని వెళ్లారు.

దాడి చేస్తున్న సమయంలో కళ్యాణ్ చేతులు అడ్డుపెట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. న్యా యవాదిగా సేవలందిస్తు న్న కళ్యాణ్‌పై దాడి అమానుషమని విశ్వహిం దూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.రామ్‌సింగ్ తీవ్రంగా ఖం డించారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.