23 August, 2026 | 5:52 PM

లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి బైక్ చోరీ

13-11-2024 12:27 AM

కామారెడ్డి, నవంబర్ 12 (విజయక్రాంతి): మహారాష్ట్ర దేగ్లూర్ నుంచి తెలంగాణ రాష్ట్రం మద్నూర్ మం డలం వైపు మంగళవారం ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. మీర్జాపూర్ వద్ద ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగి, బిచ్కుందకు వరకు వస్తానని చెప్పి ఎక్కాడు. బిచ్కుంద వద్దకు రాగానే మూత్ర విసర్జన కోసమని ఓనర్ బైక్‌ను ఆపి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి లిఫ్ట్ అడిగిన వ్యక్తి బైక్‌తో పరారయ్యాడు. దీంతో బైక్ యజమాని బిచ్కుంద పోలీసులను ఆశ్రయించాడు.