పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుంది
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పుస్తక ప్రదర్శన
నల్గొండ టౌన్: పుస్తక పట్నంతో విద్యార్థుల్లో మరింత విజ్ఞానం పెరుగుతుందని స్థానిక మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహించారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్యార్థులు డిజిటల్ మీడియా పైనే ఎక్కువగా ఆధారపడి పుస్తక పఠనాన్ని మర్చిపోతున్నారు. విద్యార్థినులకు పుస్తక పఠనంపై ఆసక్తి కలిగి ఉండాలన్నారు.
విద్యార్థులు తమ సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలే కాకుండా చరిత్ర పుస్తకాలు మహనీయుల జీవిత చరిత్రలు లాంటి పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానం ఎంతో పెరుగుతుందని తద్వారా సామాజిక సేవతోపాటు విశ్లేషణ శక్తి అలవడుతుందని తెలిపారు. కళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ రాజారామ్ మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థుల విషయ పరిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలే కాకుండా పోటీ పరీక్షలు, రీసెర్చ్ కు సంబంధించిన పుస్తకాలు, మహనీయుల జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు విద్యార్థినులకు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని కళాశాల విద్యార్థులు ఉపయోగించుకొని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు.
కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ సాలయ్య మాట్లాడుతూ, విద్యార్థులు పుస్తక పఠనం అభివృద్ధి పరచుకొని వారి యొక్క సృజనాత్మకతను వెలికి తీసి ఉన్నత శిఖరాలకు ఎదగటానికి పుస్తకాలు ఎంతో తోడ్పడతాయని వివరించారు మహనీయుల పుస్తకాలు చదవడం వల్ల చదవడం వల్ల ఎంతో స్ఫూర్తి పొందవచ్చని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ దయానంద్ డాక్టర్ అమరావతి డాక్టర్ వసంత చైతన్య సుధ, పుష్పలత, డాక్టర్ శైలజ, కళాశాల గ్రంథాలయ సిబ్బంది శంకర్, శిరీష రమాదేవి తదితరులు పాల్గొన్నారు.




