15-11-2025 02:21:23 PM
ధాన్యం లారీకి ఎత్తిన తర్వాత రైతుకు సంబంధం ఉండదు
మిల్లర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు
కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తిస్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి రైతుల ధాన్యాన్ని లారీల లోకి ఎత్తిన తర్వాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని ఏం సమస్యలున్నా కొనుగోలు కేంద్రంలోనే పరిష్కరించి ధాన్యాన్ని తీసుకోవాలని మిల్లర్లతో రైతులకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని ఆయన అన్నారు.మిల్లర్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.