24-09-2025 08:53:30 AM
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump Administration) హెచ్-1బీ వీసా రుసుము పెంచుతూ సంతకం చేసిన చేసిన కొద్ది రోజులకే వెనక్కి తగ్గారు. హెచ్-1బీ వీసా కార్యక్రమంలో అమెరికా మార్పులకు ప్రతిపాదించింది. అధిక నైపుణ్యం, అధిక వేతనాలు పొందేవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. లాటరీ విధానంలో కీలక మార్పుల దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులేస్తోంది. మార్పుల ప్రతిపాదనలను ఫెడరల్ రిజిస్ట్రార్ విడుదల చేసింది. హెచ్-1బీ కోసం ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని మార్చాలని నిర్ణయించారు. వార్షిక పరిమితి 85 వేల వీసాలు దాటితే వేతన స్థాయి ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అధిక జీతం ఉన్నవారి దరఖాస్తులను సెలక్షన్ పూల్ లో 4 సార్లు చేర్చాలని అమెరికా నిర్ణయించింది. తక్కువ జీతం కలిగిన వారి ఆర్జీ సెలక్షన్ పూల్ లో ఒకసారి పరిశీలన చేయనున్నారు.
అధిక జీతం ఉన్నవారికి వీసా లభించే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త ప్రతిపాదనలపై 30 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయన్నారు. మానిఫెస్ట్ లా ప్రిన్సిపల్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నికోల్ గుణారా మాట్లాడుతూ, కొత్త ప్రతిపాదన ప్రపంచ ప్రతిభ అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి ఎలా ప్రవహిస్తుందో పునర్నిర్మించగలదని అన్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ ఐటీ దిగ్గజాలు హె-1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడతాయి. కొత్త రుసుము కంపెనీలకు బిలియన్ల కొద్దీ నష్టం కలిగించవచ్చు. దీంతో నియామకాలు తగ్గించడం లేదా ఉద్యోగాలను తిరిగి భారతదేశానికి మార్చడం జరగవచ్చు. సోమవారం న్యూయార్క్‌లో ట్రంప్ పరిపాలన అధికారులను కలవడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ అమెరికా పర్యటన నేపథ్యంలో ఇది జరిగింది. టారిఫ్‌లు, H1B వీసాలపై తీసుకున్న నిర్ణయాలు అమెరికా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాయని ట్రంప్ పేర్కొన్నారు.