calender_icon.png 19 January, 2026 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కేంద్ర గ్రంథాలయానికి కొల్లి ఫౌండేషన్ పుస్తకాల వితరణ

19-01-2026 06:12:44 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు శాఖ గ్రంధాలయం ఇల్లందుకు ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ ను రైటింగ్ పాడ్స్  వితరణగా ఇచ్చారు. విద్యార్థిని విద్యార్థులు ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కాంపిటీటివ్ పరీక్షకు సంబంధించిన పుస్తకాలు కూడా వారు కోరిన్నారు. వారి కోరిక మేరకు చైర్మన్ పసుపులేటి వీరబాబు, కొల్లి ఫౌండేషన్ వారికి తెలియజేశారు. వారి కోరికను కాదనకుండా సహృదయంతో స్పందించిన కల్పన చౌదరి  రూ 15వేల విలువచేసే పోటీ పరీక్షకు సంబంధించిన పుస్తకాలను సోమవారం సాయంత్రం జిల్లా గ్రంథాలయంలో గ్రంథ పాలకురాలు జి మణి మృదులకి అందజేశారు.

కల్పన మాట్లాడుతూ జీవితాంతం సేవా దృక్పథంతో నా జీవితాన్ని ఎంచుకున్నానని నా శాయశక్తుల పరిధిలో ఉన్నంతవరకు పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు తన వంతు సహాయం అందిస్తానన్నారు. గ్రంథ పాలకురాలు మృదుల మాట్లాడుతూ... అన్ని దానముల కన్నా విద్యా దానం చాలా గొప్పదని ఎన్నో విధాలుగా కొన్ని ఫౌండేషన్ వారు సహాయ సహకారాలను అందిస్తూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నందుకు వారికి గ్రంథాలయం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు.