calender_icon.png 19 January, 2026 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలి

19-01-2026 06:07:21 PM

జనరల్ సెక్రెటరీ మంద లక్ష్మీనారాయణ

జవహర్ నగర్,(విజయక్రాంతి): బృహత్ మహా నగర పరిధిలోని జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్ 2 లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు దాతలు, స్థానిక నాయకులు  ప్రజా ప్రతినిధులు ఉదారత చాటుకోవాలని ఆలయ అభివృద్ధి సొసైటీ జనరల్ సెక్రెటరీ మంద లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... పురాతన వైభవం ఉట్టిపడేలా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని కమిటీ నిర్ణయించిందని, ఈ మహాత్కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

భగవంతుడి సేవలో తరించే భాగ్యం అందరికీ దక్కదని, దాతలు ముందుకు వచ్చి ఆలయ విస్తరణకు, భక్తుల వసతుల కల్పనకు తమ వంతు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా జవహర్ నగర్ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు స్పందించి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు లేదా సహకారాన్ని అందించాలని అన్నారు . స్వామివారి కృపతో మరికొంత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేవాలయ శోభను పెంచేందుకు తోడ్పడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.