calender_icon.png 19 January, 2026 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 మందికి రూ.లక్షా 5 వందలు జరిమానా

19-01-2026 06:16:18 PM

సిద్దిపేట క్రైం: నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన పలువురికి న్యాయమూర్తి జరిమానా విధించారని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇటీవల పట్టణంలోని పలు చౌరస్తాల్లో తనిఖీ నిర్వహించగా, ఎనిమిది మంది మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పట్టుబడ్డారని చెప్పారు.

సోమవారం వారిని  సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరుచగా,  విచారణ చేసి ఎనిమిది మందికి రూ.80వేల 5 వందలు జరిమానా విధించారని తెలిపారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురికి రూ.20వేలు జరిమానా విధించారని సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.