16 July, 2026 | 1:04 AM

కొణతం దిలీప్‌కు హైకోర్టులో ఊరట

07-06-2024 02:34 AM

టీజీఎస్ నకిలీ లోగో కేసులో పోలీసులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): టీజీఎస్ ఆర్టీసీ పేరుతో నకిలీ లోగో తయారుచేసిన కేసులో కొణతం దిలీప్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సీఆర్పీసీలోని 41ఏ కింద నోటీసులు ఇచ్చాకే దిలీప్‌ను విచారించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ప్రతివాదులైన పోలీసులకు, ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఏ శ్రీధర్‌కు నోటీసులు జారీచేసింది. నకిలీ లోగో వల్ల ఆర్టీసీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని ఏ శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడాన్ని దిలీప్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై ఇటీవల జస్టిస్ ఏ సుజన విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. 

కేసు విచారణ పూర్తయ్యేదాకా అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనల తర్వాత పిటిషనర్ శ్రీధర్‌తోపాటు పోలీసులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేసింది.