10న డీఈఈసెట్
07-06-2024 02:32 AM
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు టీజీ డీఈఈసెట్ కన్వీనర్ రాధారెడ్డి గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జూలై 10న ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు సెప్టెంబర్ 1 నాటికి 17 ఏండ్లు పూర్తయ్యి ఉండాలని తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో కోర్సులను నిర్వహిస్తారు.






