08-01-2026 12:38:58 AM
డిప్యూటి సీఎం భట్టికి ఎమ్మెల్యే కోవలక్ష్మి వినతి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి7 (విజయక్రాంతి): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్కను బుధవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో నామకరణం చేసినప్పటికీ కళాశాల వద్ద ఇప్పటికీ బోర్డు ఏర్పాటు చేయలేదని,
అలాగే కళాశాలకు సం బంధించిన వ్బుసైట్లో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు నమోదు చేయాలని ఆమె కోరారు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ జయం తి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రిని వినతిపత్రం ద్వారా అభ్యర్థించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకుడు అనుమండ్ల జగదీష్ పాల్గొన్నారు.