calender_icon.png 10 January, 2026 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్లవాయి అభివృద్ధికి నిధులు మంజూరు

08-01-2026 12:37:45 AM

ఖానాపూర్, జనవరి 7 (విజయక్రాంతి): ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ విజ్ఞప్తి మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మార్లవాయి అభివృద్ధికి రూ.91.20 లక్షల నిధులు మంజూరు అయ్యా యి.

గత ప్రభుత్వ హయంలో నిర్లక్ష్యానికి గురైన జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామాన్ని మళ్లీ ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారా వు సానుకూల స్పందనకు గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.