calender_icon.png 10 January, 2026 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్‌పల్లిలో గుండె వైద్య శిబిరం

08-01-2026 12:41:43 AM

మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో..

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి) : హైదరాబాద్ హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెట్‌పల్లిలోని తిరుమల నర్సింగ్ హోమ్‌లో గుండె వ్యాధులపై బుధవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నితిన్ అన్నారపు పాల్గొని, గుండె సమస్యలతో బాధపడుతున్న రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు, మార్గదర్శకత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ నితిన్ అన్నారపు మాట్లాడుతూ.. గుండె జబ్బులు ఉన్నవారు లేదా గుండె సంబంధిత లక్షణా లు కనిపించే వారు సరైన సమయంలో నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో కీలకం అన్నారు.