calender_icon.png 10 January, 2026 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

09-01-2026 10:09:38 AM

విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి

హుజూర్ నగర్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్

హుజూర్ నగర్: యువత మత్తు పదార్థాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని హుజూర్ నగర్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ విద్యార్థులను కోరారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు...సమాజానికి దిశా నిర్దేశకులు,మంచి సమాజ నిర్మాతలు విద్యార్థిని,విద్యార్థులు, యువకులేనని సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నా, అమ్మినా,కొనుగోలు చేసినా, సేవించినా, చట్టంలో తీవ్రమైన నేరంగా నిర్దేశించబడినదనీ అటువంటి నేరానికి పాల్పడిన వారికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.

మాదక ద్రవ్యాలను వినియోగించి విద్యార్థులు తమ బంగారు ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆమె విద్యార్థులకు హితవు పలికారు.  మీకు సమీపంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాల వినియోగం జరుగు తున్నట్లుగా మీకు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు ఆ సమాచారాన్ని అందించి మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులు నడుం బిగించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ మోహన్ బాబు,సీనియర్ న్యాయవాది కాల్వ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ రామారావు,     న్యాయశాఖ సిబ్బంది అనిత, సుశీల అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.