27 July, 2026 | 6:08 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులుగా కొండ సైదులు గౌడ్

23-02-2026 09:06 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల గ్రామ పంచాయతీ కార్మికుల సిఐటియు అనుబంధ సంఘం అధ్యక్షులుగా కొండ సైదులు గౌడ్ ఎన్నికయ్యారు. మండలంలోని అప్పన్నపేట గ్రామంలో యూనియన్ మండల మహాసభ రావుల వెంకన్న అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.

సిఐటియు అనుబంధ యూనియన్ నూతన కమిటీ అధ్యక్షులుగా కొండ సైదులు, ప్రధాన కార్యదర్శిగా అమరవరపు శ్రావణ్ కుమార్  ఎన్నుకున్నట్లు సిఐటియు జిల్లా నాయకులు షేక్ యాకూబ్ తెలిపారు.మొత్తం ఎనిమిది మందితో నూతన కమిటీని ఎన్నికైనట్టు ఆయన ప్రకటించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కొండ సైదులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.