05-07-2025 12:00:00 AM
కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం జులై 4 (విజయ క్రాంతి): బహుముఖ ప్రజ్ఞాశాలి సౌమ్యత వి షయంలో స్పష్టతతో ఏ పనైనా నిబద్ధతతో చేసి తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన మహోన్నత వ్యక్తి కొనిజే టి రోశయ్య అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటి ల్ కొనియాడారు. శుక్రవారం ఐ డి ఓ సి కా ర్యాలయంలో మాజీ తమిళనాడు గవర్నర్ రోశయ్య 92వ జయంతి ని ఘనంగా నిర్వహించారు.
ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం మాట్లాడుతూ రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసి బడ్జెట్ కూర్పులో ఘనపాటిగా పేరుందిన మహా నాయకుడన్నారు. ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1968 నుండి 1980 సంవత్సరం వరకు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు.
తొలిసారిగా మర్రి చె న్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు భవనాలు, రవా ణా శాఖ మంత్రిగా పనిచేసి ఆ తర్వాత అనేక ముఖ్యమంత్రుల మంత్రి వర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వ రకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్ గా తన సేవ లు అందించారని, అటువంటి మహానియుడుని స్మరించుకుంటూ మనమందరం పట్టు దలగా పనిచేసి మన ఉద్యోగ ధర్మాన్ని గిరిజ న ప్రజల సంక్షేమానికి పాటుపడాలని ఉన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఉపాధి కల్పనాధికారి శ్రీ రామ్, క్రీడల అధికారి పరంధామ రెడ్డి, బీసీ వెల్ఫేర్. ఇందిరా, కలెక్టరేట్ పరిపాలన అధికారి అనంత రామకృష్ణ పాల్గొన్నారు.