04-07-2025 10:44:58 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు యంత్రాంగం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల రోశయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల మాట్లాడుతూ... రోశయ్య సుదీర్ఘ కాలంగా ప్రజాసేవలో నిమగ్నమై, చేసిన దేశసేవ, పరిపాలన పటిమ, నిష్కళంక రాజకీయ జీవితాన్ని స్మరించుకున్నారు. రాజకీయాల్లో ఉన్నతమైన నైతిక విలువలకు నిలయంగా నిలిచారని, ఆయన సేవా తత్వం, ప్రజలపట్లకలిగిన కట్టుబాటు ప్రతి అధికారికి ప్రేరణగా నిలవాలని ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.