05-07-2025 12:00:00 AM
ములకలపల్లి జూలై 4 ( విజయ క్రాంతి ): ఆదివాసీల ఉనికికి ప్రమాదకరంగా మారిన జీవో నెంబర్ 49 నీ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవా రం ములకలపల్లి లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనను ఉద్దేశించి రాష్ట్ర కమిటీ సభ్యులు గౌరీ నాగేశ్వరరావు మాట్లాడారు. ఆదివాసీలను అడవులు నుండి దూ రం చేసేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయన్నారు.
ఆదివాసీల గ్రామాలు వాళ్ళ యొక్క భూములు ,జీవన విధానాన్ని దూరం చేయాలని కార్పొరేట్ శక్తులకు అడవులను కట్టబెట్టేందుకే టైగర్ జోన్ కొమరం భీమ్ కన్సర్ట్ పేరుతో ఈ జీవోను తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ జీవో ర ద్దు కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఆదివాసీలకు నష్టంజరిగే ఏ పని తలపెట్టిన సంఘం ఆదివాసీలకు అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు పోడియం వెంకటేశ్వర్లు, సోయం కృష్ణ, దుబ్బ వెంకటేశ్వర్లు, మాలోత్ రావుజ, కుంజ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.