15 March, 2026 | 7:28 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

ప్రజా ప్రతినిధిగా కొణిజేటి రోశయ్య గొప్ప సేవలందించారు

05-12-2025 12:00 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 4, (విజయక్రాంతి):ప్రజా ప్రతినిధిగా కొణిజేటి రోశ య్య గొప్ప సేవలు అందించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మాజీ ము ఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నాల్గవ వర్ధంతి సభను ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా యు వజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితే ష్ వి. పాటిల్ పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివా ళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ కొణిజేటి రోశయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇతర రాష్ట్రాలకు గవర్నర్ గా విశిష్టమైన సేవలు అందించారని తెలిపారు. రోశయ్య రాజకీయ జీవితమంతా ప్రజల సంక్షేమం, నిస్వార్థ సేవకే అంకితమైందని ఆయన సేవలను గుర్తు చేశారు.

ఆచరణలో సాధారణత, పరిపాలనలో ప్రతిభ ఆయన ప్రత్యేకతని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు కోసం కొణి జేటి రోశయ్య ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి పరందామరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి విజయ లక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.