04-12-2025 11:19:38 PM
ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): నల్లకుంట డివిజన్ బాయమ్మగల్లీలోని శ్రీ గురు దత్త ఆలయంలో గురువారం శ్రీ దత్త జయంతి వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నల్లకుంట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్, ఎస్త్స్ర శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం భక్తులు, ఆలయ నిర్వాహకులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు సేవలందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ మేరీ ప్రసాద్, విజేందర్ సాగర్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.