04-12-2025 11:17:44 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గా చెరుకుల రాజేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు గురువారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో జాతీయ ప్రధాన కార్యదర్శి ర్యాగ రిషి అరుణ్ బాబు రాజేందర్ కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జాతీయ కన్వీనర్ గా నియమితులైన చెరుకుల రాజేందర్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల పోరాట ఫలితంగా నాపై నమ్మకం ఉంచి జాతీయ కన్వీనర్ గా నియమించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ర్యాగ అరుణ్ బాబుకు, నాకు సహకరించిన బీసీ మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి, హక్కుల సాధనకై గత 50 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య తో కలిసి బీసీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, బీసీ సంఘం నేతలు చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.