కొరియన్ కనకరాజు నటుడిగా సంతృప్తినిచ్చింది
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రితికా నాయక్ కథానాయిక. ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కానుంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించాలని ఈ సినిమా చేశాం. ఈ సినిమా కొరియాలో షూట్ చేసినప్పటికీ భాష విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇందులో నేను రెండు పర్సనాలిటీస్‌లో కనిపిస్తాను. ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉంటే ఎలాంటి ఛాలెంజెస్ వుంటాయి. ఈ సినిమా చేయడం నటుడిగా నాకు చాలా సంతృప్తినిచ్చింది” అన్నారు. రీతికా నాయక్ మాట్లాడుతూ.. “నేను చేసిన ప్రతి సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు.
ఈ సినిమాలో నేను చేసిన చైత్ర పాత్ర కూడా అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా” అన్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. “సినిమాలో ఎక్కువ ఫన్, కామెడీ ఉంటుంది. ఆగస్టు 7న తప్పకుండా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నా” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు సత్య, డీవోపీ మనోజ్ కూడా మాట్లాడారు.






