15-12-2025 10:15:14 PM
జేఎస్ డబ్ల్యూ మోటార్ ఇండియా ఆల్-న్యూ ఎంజీ హెక్టర్‌ను విడుదల చేసింది. బంజారాహిల్స్ లోని ఎంజీ మోటార్స్ షోరూంలో బిగ్ బాస్ సీజన్ -2 విజేత కౌశల్ కొత్త మోడల్ ను ఆవిష్కరించారు. ఇది ఎస్ యూవీ విభాగంలో బోల్డ్ డిజైన్, సాటిలేని సౌకర్యం, మార్గదర్శక సాంకేతికతతో రూపొందించినట్టు ఎంజీ మోటార్స్ ఇండియా తెలిపింది. ఈ ఆల్-న్యూ హెక్టర్ అద్భుతమైన లక్షణాలను కలిగి ఉందనీ, సరికొత్త ఫ్రంట్, రియర్ బంపర్ డిజైన్, కొత్త గ్రిల్ డిజైన్, వినూత్నమైన అల్లాయ్ వీల్స్ తో ఆకట్టుకుంటుందని వెల్లడించారు. ఈ మోడల్ బయటి భాగం, సెలాడాన్ బ్లూ, పెర్ల్ వైట్ అనే రెండు కొత్త రంగులతో లభిస్తున్నట్టు తెలిపారు.
అంతేకాకుండా ఇంటీరియర్స్ 5-సీటర్ ట్రిమ్‌లో డ్యూయల్ టోన్ ఐస్ గ్రే థీమ్‌ను కలిగి ఉన్నాయి. 6 మరియు 7-సీటర్ ట్రిమ్‌లకు డ్యూయల్ టోన్ అర్బన్ టోన్స్ కలిగి ఉన్నాయి. ఇది మరింత ప్రీమియంగా ప్రతీ ఒక్కరినీ ఆహ్వానించే క్యాబిన్ తో తయారైంది. ఆల్-న్యూ ఎంజీ హెక్టర్ శ్రేణి రూ 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కొత్త మోడల్ ఇప్పుడు రెండు కొత్త కలర్ థీమ్‌లను అందిస్తున్నాయి. 6- 7సీట్ల వేరియంట్‌లకు డ్యూయల్ టోన్ అర్బన్ టాన్ తో అందమైన, లగ్జరీ హంగులతో ఉన్నత స్థాయి ఇంటీరియర్ తో లభిస్తోంది. దీనితో పాటు 5-సీట్ల వేరియంట్‌కు డ్యూయల్ టోన్ ఐస్ గ్రే, సొగసైన నలుపు-బూడిద రంగు పాలెట్ తో టెక్-ఫార్వర్డ్ స్టైల్ అందిస్తుంది.
ఈ థీమ్, ఇంటీరియర్‌లను హైడ్రా గ్లోస్ ఫినిష్ యాక్సెంట్‌లతో.. హైడ్రోఫోబిక్ బ్లాక్-బ్లూ ఇన్సర్ట్‌లు దీర్ఘకాలిక మన్నికను జోడిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆవిష్కరణ సందర్భంగా జేఎస్ డబ్ల్యూ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ హెక్టర్ మా తొలి నేమ్‌ప్లేట్... అంతేకాకుండా ఇది త్వరగా ఎంజీ బ్రాండ్‌కు పర్యాయపదంగా మారిందన్నారు. ప్రారంభం నుంచే 1,50,000 మంది కస్టమర్‌లతో భారతదేశంలో అత్యంత ప్రియమైన ఎస్ యూవీలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఆల్-న్యూ ఎంజీ హెక్టర్‌తో... దాని డిజైన్, సౌకర్యం, సాంకేతికతను మెరుగుపరచడం ద్వారా, సాటిలేని విలువను అందించడం ద్వారా మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళతామని తెలిపారు.