కోరుట్ల వాసికి ఫస్ట్ ర్యాంక్
ఎయిమ్స్ ఎంట్రెన్స్‌లో అదరగొట్టిన దొంతుల శరత్ చంద్ర
సూపర్ స్పెషాలిటీ న్యూరో విభాగంలో మొదటిస్థానం
జగిత్యాల, మే 29 (విజయక్రాం తి): కేంద్ర ప్రభుత ఆధర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎయిమ్స్) సూపర్ స్పెషాలిటీ న్యూరో ఎంట్రెన్స్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా వాసి జాతీ య స్థాయి లో మొదటి స్థానంలో నిలిచారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన దొంతుల శరత్ చంద్ర ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నారు. ఆయన ఎంబీబీఎస్ హైదరాబాద్‌లోని ఉస్మానియాలో పూర్తిచేశారు. ఎండీ చంఢీగడ్‌లో చేశారు.
ఈ సందర్భం గా శరత్‌చంద్రను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా శరత్ చంద్ర ‘విజయక్రాంతి’తో మాట్లాడుతూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న సంకల్పంతో చదివి పరీక్ష రాశానని తెలిపారు. ఎయిమ్స్ ఎంట్రెన్స్‌లో ఆల్ ఇండియా మొద టి ర్యాంక్ రావడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. తన విజయానికి అమ్మానాన్న నాగరాజు సంపూర్ణ సహకారం అందించారని అన్నారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని పేర్కొన్నారు.






