28 July, 2026 | 11:52 AM

సేవాలాల్ మహారాజ్ మార్గంలో నడవాలి: మంత్రి సీతక్క

30-05-2024 01:14 AM

 హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి) : బంజారుల ఆరాధ్య దైవం సేవాలాల్  మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పేర్కొనారు. బుధవారం కొంపెల్లిలోని సేవాలాల్ మహారాజ్‌ను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సేవాలాల్ కాలం చేసి రెండు వేల సంవత్సరా లు దాటినా నేటికీ దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్ప దో అర్థం చేసుకోవచ్చన్నారు. అహిం సా మార్గాన్ని అవలంబించాలని, మద్యపానానికి దూరంగా ఉంచాల ని, మహిళలను గౌరవించాలనే సే వాలాల్ బోధనలు తరతరాలకు ఆదర్శనీయం.. అనుసరణీయమని పేర్కొన్నారు.   సేవాలాల్ జయంతి ని అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ రాములు నాయక్, ఇతర నేతలు ఉన్నారు.