18-07-2025 10:27:41 PM
రాష్ట్ర ప్రిన్సిపల్ చీప్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారి ఏలు సింగ్ మేరు
కామారెడ్డి,(విజయక్రాంతి): పెద్దపులి సంచారం పట్ల అటవీశాఖ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అధికారి ఏలు సింగ్ మేరు అన్నారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామ శివారులోని స్కూల్ తండా అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. గత గురువారం పెద్దపులి సంచారం చేసి ఆవును చంపివేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి విధితమే. పెద్దపులి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పెద్దపులి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. పెద్దపులి అడుగుజాడలను అధికారులు ఆయనకు చూపించారు. పెద్దపులి అచూకీ కోసం ఏర్పాటుచేసిన ట్రాక్ కెమెరాలను పరిశీలించారు. పెద్దపులి కదలికలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సమాచారం అందించాలని సూచించారు. పెద్దపులి ఎక్కడ ఉంది ఎక్కడ సంచారం చేస్తుంది అనే విషయాలను అప్రమత్తంగా కనిపె పెడుతూ సమాచారం అందించాలన్నారు. అంతకుముందు ఆయన కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో వనమ ఉత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు.