కొత్తకొండ హుండీ ఆదాయం లెక్కింపు
భీమదేవరపల్లి ,మార్చి 24 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్ర స్వామి దేవస్థానం కొత్త కొండ నందు వరంగల్ జిల్లా ఇన్స్పెక్టర్ అ నిల్, ఈఓ కిషన్ రావు సమక్షంలో నిర్వహించిన హుండీ లెక్కింపు నందు నోట్లు 10 లక్షల 47,000 ఆదాయం వచ్చినట్లు ఆల య ఈవో పి కిషన్ రావు తెలిపారు.
కాయిన్స్ 1,03,365
మొత్తం 11,50,385 హుండీ ఆదాయం వచ్చినది. వెండి బంగారం తిరిగి హుండీ లో వేయడం జరిగినది. 15 నోట్లు విదేశీ కరెన్సీ వచ్చినది.ఈ కార్యక్రమంలో హరి హర సేవాసమితి హన్మకొండ శ్రీనివాస సేవా సమితి హన్మకొండ సరస్వతి సేవాసమితి కొత్త కొండ సభ్యులు పాల్గొన్నారు.
రైతులతో నేరుగా విచారణ
భీమదేవరపల్లి, మార్చి 24( విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కు చెందిన రైతుల కు గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా నీటిని అందించేందుకు మం డలంలో కాలువలు తీసేందుకు భూములు కోల్పోతున్న రైతులతో మంగళవారం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నుండి వస్తున్న నీటిని కాలువలు తీస్తున్న సందర్భంగా భూ నిర్వాసితుల తో ఆర్డిఓ రమేష్ రాథోడ్, భీమదేవరపల్లి తాసిల్దార్ రాజేష్ విచారణ చేశారు. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి మండలానికి చెందిన 25 గ్రామాల కు చెందిన రైతులు పాల్గొన్నారు.




