15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కొత్తకోట రచనలు సామాజిక మార్పు కలిగిస్తాయి

13-10-2025 12:00 AM

కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్

హనుమకొండ,అక్టోబర్ 12 (విజయ క్రాంతి): కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రచనలు సామాజికంగా మార్పు కలిగించే విధంగా వున్నాయని కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ తెలిపారు. మిత్ర మండలి అధ్వర్యంలో  విశ్రాంత ఐపిఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రచించిన “పుంజు తోక” సంపుటి అవిష్కరణ సభను ఆదివారం హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ ముఖ్య అతిధిగా పాల్గోన్న ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వల చేసారు. అనంతరం అంపశ్య నవీన్ చేతుల మీదుగా కొత్తకోండ శ్రీనివాస్ రెడ్డి రచించిన “పుంజు తోక” సంపుటిని అవిష్కరించారు. ఈ సందర్బంగా అచార్య బన్న అయిలయ్య, నాగిళ్ళ రామశాస్త్రి, వి.ఆర్ విద్యార్థి పుంజు తోక సంపుటిలోని కవితలపై వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ విశ్లేషణాత్మకంగా వివరించడం జరిగింది.

అనంతరం ముఖ్య అతిధి అంపశయ్య నవీన్ మాట్లాడుతూ కొత్తకోండ శ్రీనివాస్ రెడ్డి రచించిన “పుంజు తోక” సంపుటిలోని  సామాజిక స్పూర్తి కలిగించే రీతిలో కవితలు వున్నాయని.  కొత్తకోట కవితలు అభ్యుదయ రచనలుగా వున్నాయని, శ్రీనివాస్ రెడ్డినీ అభ్యుద కవిగా భావిస్తున్నానని,  రాబోవు రోజుల్లో మరిన్ని అభ్యుదయ రచనలు రావాలని అంపశయ్య కోరారు.

విశ్రాంత ఐపిఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ నాకు ప్రత్యేక అనుభూతులను మిగిల్చింది, నేను ఇక్కడ ట్రైనింగ్ ఏఎస్పీగాపనిచేయడంతో పాటు, ఇదే జిల్లా ఏస్పీగా పనిచేసే భాగ్యం తనకు కలిగిందని,విద్యార్థి దశ నుండి కవితలు రాయడం అలవాటని, నేను వ్రాసిన కొన్ని అనాడే ప్రచురితం అయ్యాయని, పోలీస్ అధికారి అయ్యాక నా అనుభవాలను కేవలం నావరకు మాత్రమే పుస్తకంలో వ్రాసుకునేవాడినని ఈ పుస్తకం రాయడంలో ఎంతో మంది శ్రీశ్రీ,చలం, కాళోజీ లాంటి కవులతో పాటు సినీ దర్శకులు సత్యజిత్రే, నర్సింగరావు లాంటి  నాకు స్పూర్తి నిచ్చారాని, ముఖ్యంగా సాహిత్యమనేది సంస్కరం అందించడం మానవ విలువలను కాపాడుతుందని కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ట్రై సిటికి చెందిన సాహిత్యవేత్తలు, పోలీస్ అధికారులు, ఉద్యోగులు, పాల్గోన్నారు.