13-10-2025 12:00:00 AM
వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 12(విజయక్రాంతి): వెంకటాపురం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ విజేతగా వెంకటాపురం హంటర్స్ టీమ్ నిలిచింది. ఆదివారం స్థానిక కాఫెడ్ క్రీడామైదానంలో జరిగిన ఫైనల్ పోటీలో వెంకటాపురం హంటర్స్, మహాలక్ష్మి టీంలు ఫైనల్లో పోటీపడ్డాయి.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హంటర్స్ టీం 15 ఓవర్లలో 108 పరుగులకు మహాలక్ష్మి టీం ను కట్టడి చేసింది. అనంతరం 19 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హంటర్స్ టీం మూడు వికెట్లు కోల్పోయి పది ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని చేరుకుంది. టోర్నీలో విజేతగా నిలిచిన అండర్ స్టేటుకు మొదటి బహుమతిగా షీల్ తో పాటు రూ.55,555లు నగదు బహుమతిని అందుకున్నారు.
రన్నరపుగా నిలిచిన మహాలక్ష్మి టీంకు రూ. 33,333లు నగదు బహుమతి తో పాటు షీల్ ను అందించారు. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకటాపురం సిఐ ముత్యం రమేష్ విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఎటువంటి వివాదాలు లేకుండా విజయవంతంగా నిర్వహించిన నిర్వాహక కమిటీకి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు.
యువత క్రీడలతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడంతోపాటు శారీరక, మానసిక ధారుడ్యానికి ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ టోర్నిలో బౌలింగ్, బ్యాటింగ్, కీపింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎస్‌ఐ కొప్పుల తిరుపతిరావు, ఎస్త్స్ర తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిడంమోహన్రావు, సయ్యద్ హుస్సేన్ చిడెం శివ, చిట్టెం టాకయ్య, బి ఆర్ ఎస్ నాయకులు గొడవర్తి నరసింహమూర్తి, గంపా రాంబాబు, డర్రా దామోదర్ ముడుంబా శ్రీనివాస్, రిటైర్డ్ సీనియర్ ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్, కాల్వ సుందర్రావు, కాఫీడ్ స్వచ్ఛంద సంస్థ ఇంచార్జి లూర్ధురాజ్, టోర్నీ నిర్వాహకులు పాల్గొన్నారు.