24 June, 2026 | 12:31 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

ములుగు డిప్యూటీ కలెక్టర్‌గా కొత్తపల్లి కుశీల్ వంశీ

30-09-2025 02:38 AM

ములుగు, సెప్టెంబరు29(విజయక్రాంతి):ములుగు జిల్లా డిప్యూటీ కలెక్టర్గా కొత్తపల్లి కుశీల్ వంశీ సోమవారం ఉదయం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.కు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. విధుల్లో చేరిన కొత్తపల్లి కుశీల్ వంశీని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అభినందిస్తూ, ప్రజలకు సేవలందించే క్రమంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

అనంతరం తల్లి,తండ్రి బంధు మిత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర కేడర్లో డిప్యూటీ కలెక్టర్గా నియామకం పొందడం అభినందనీయమని అన్నారు. విధుల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందాలని బాధ్యతలను సమర్థవంతంగా   నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కోచింగ్ తీసుకున్న వివరాలను అడిగి తెసులుకున్నారు. ఉద్యోగ సాధనలో ప్రోత్సాహించిన తల్లితండ్రులను కలెక్టర్  ప్రత్యేకంగా అభినందించారు.