29 August, 2026 | 7:51 AM

సీఎంకు రాఖీ కట్టిన కొత్తకుర్మ మంగమ్మ

29-08-2026 01:17 AM

ఆదిభట్ల, ఆగస్టు 28 (విజయక్రాంతి): రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్రెడ్డికి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ రాఖీ కట్టారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు గుడ్ల అర్జున్, వెంకట్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.