calender_icon.png 19 October, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొగులయ్యకు కేటీఆర్ భరోసా

19-10-2025 12:40:55 AM

ఇంటి స్థలం సమస్య, కంటి చికిత్స బాధ్యత తీసుకున్న కేటీఆర్

తన ఇంటిని కబ్జాదారులు కూల్చివేస్తున్నారని మొగులయ్య ఆవేదన

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ దర్శనం మొగులయ్యకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మొగులయ్య శనివారం కేటీఆర్ నివాసంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా మొగులయ్య తన కంటిచూపు మందగించిందని, చికి త్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.

వెంటనే స్పందించిన కేటీఆర్ మొగుల య్యకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం మొగులయ్య గత ప్రభుత్వం తనకు హయత్‌నగర్ మండలం లో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్‌కు వివరించా రు.

ఆ ఇంటి స్థలాన్ని కొంతమంది కబ్జాదారు లు కబ్జాకు యత్నిస్తున్నారని, తాను కట్టుకున్న గోడలను, ఇంటిని కూడా కూలగోట్టారని, కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అనేకసార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం దొరకలేదని, తనకు అండగా నిలవాలని కోరారు. గతంలో వృద్ధాప్య కళాకారుల కింద తనకు ఇచ్చిన రూ. 10 వేలు నెలవారి పెన్షన్ కూడా సరిగ్గా రావడంలేదని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

స్పందించిన కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి ‘సమస్యను వెంటనే పరిష్కరించి, మొగులయ్యకు న్యాయం చేయా లి’ అని సూచించారు. అవసరమైతే, మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసు లను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

కేసీఆర్‌కు కృతజ్ఞతలు

ఒకప్పుడు లింగాల అడవుల్లో 12 మెట్ల కిన్నె ర వాయించుకునే తనకు అప్పటి సీఎం కేసీఆర్ ప్రేమతోనే గుర్తింపు దక్కిందని మొగులయ్య కేటీఆర్‌కు తెలిపారు. కేసీఆర్ తనను గుర్తించి ఉగాది పురస్కారం ఇచ్చి గౌరవించడం వల్లనే తన కళ ప్రపంచం దృష్టికి చేరిందని, తదనంతరం పద్మశ్రీ అవార్డు కూడా దక్కిందని పేర్కొన్నారు. కేసీఆర్ తమ కుటుంబం కోసం చేసిన సహాయానికి, తమ కష్టాలన్నీ తీర్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.