15 April, 2026 | 6:09 AM

పాక్.. తస్మాత్ జాగ్రత్త

19-10-2025 12:41 AM

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఏ విషయమైనా ముక్కుసూటిగా చెప్పడం అలవాటు. పాక్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే ఉందని, ఆ దేశం జాగ్రత్తగా ఉంటే మంచిదని హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ చిన్న ట్రైలర్ మాత్రమేనని, యుద్ధం ఏదైనా భారత ఆర్మీ ఎప్పుడూ సిద్ధమేనని, గెలుపు మాకు కొత్త కాదని కుండబద్ధలు కొట్టడం ఆయనకే చెల్లింది.