17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కేటీఆర్‌వి నిరాధార ఆరోపణలు

12-04-2025 12:00 AM

మా ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీఆర్‌ఎస్, బీజేపీ పని: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పందించారు. కేటీఆర్‌వి నిరాధార ఆరోపణలంటూ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని బద్నాం చేయడమే బీఆర్‌ఎస్, బీజేపీ పనిగా పెట్టుకుని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు.

కొందరు కావాలనే ఏఐ ఫొటోలు, వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్న చేస్తున్నారని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ఎక్కడా కూడా ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు.

మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు స్పందిస్తూ.. తమ వద్ద ఎవరూ ఎటువంటి భూమిని తనఖా పెట్టలేదని, టీజీఐఐసీకి ఎటువంటి తనఖా రుణాన్ని అందించలేదని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐ)కి తాము తనఖా రుణాన్ని అందించలేదని స్పష్టం చేసింది.