calender_icon.png 4 May, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పార్కును అభివృద్ధి చేస్తా

12-04-2025 12:00:00 AM

కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్ 

ఎల్బీనగర్, ఏప్రిల్ 11: కొత్తపేట డివిజన్ పరిధిలోని పార్కులను అభివృద్ధి చేస్తానని కార్పొరేటర్ పవన్ కుమార్ తెలిపారు. తెలంగాణ పార్కును శుక్రవారం ఆయన సం దర్శించి, సమస్యలను పరిశీలించారు. తెలంగాణ పార్కును  రూ.35 లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పార్కులో త్వరలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో  యూబీడీ ఆర్టికల్చర్ మేనేజర్ సత్యనారాయణ, నాగేశ్వర్ నగర్ కాలనీ అధ్యక్షుడు రామ్నాథ్ రెడ్డి, ఎస్ ఆర్‌ఎల్ కాలనీ అధ్యక్షుడు సుధాకర్, విజయభాస్కర్, ఠాకూర్ అక్షయ్ సింగ్, నాయకులు మంచి రాజేశ్, ఠాకూర్ అశ్విన్ సింగ్, కాట విజయ గౌడ్, కొత్త తిరుమల, తోట మహేందర్ యాదవ్, వెంకట్ రెడ్డి, గట్టు మహేశ్, రయిక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ గాంధీ నగర్‌లో పర్యటన

కాలనీలో జలమండలి అధికారులు తాగునీటి కోసం గుంతలు తీసి సరిగ్గా ప్యాచ్ వర్క్ చేయకపోవడంతో కాలనీ ప్రజలు నడవలేకపోతున్నారని, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మ్యాన్ హోల్స్ కూడా పాడైపోయాయని స్థానికులు ఫిర్యా దు చేశారు. శుక్రవారం కార్పొరేటర్ పవన్ కుమార్ రాజీవ్ గాంధీ కాలనీలో పర్యటించారు. సమస్యలు పరిష్కరించాలని జలమం డలి ఏఈ శ్రవంతితో మాట్లాడారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు స్వామి, భిక్షపతి, ధనరాజ్, నాయకులు ఠాకూర్ అశ్విన్, కొత్త తిరుమల, వెంకట్ రెడ్డి, గట్టు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.