17 March, 2026 | 4:11 PM

నేను ఇప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోతా..! భట్టి విక్రమార్క రాజీనామాకు సిద్ధమా ?

17-03-2026 02:40 PM

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి(Governor's Speech) ధన్యవాదలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. మహిళలకు వడ్డీలేని రుణాలపై పచ్చి అబద్ధాలు చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు(Deputy CM Bhatti Vikramarka) మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) సవాల్ విసిరారు. మహిళలకు రూ. 57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని భట్టి విక్రమార్క అన్నారు.. వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవమైతే ఆర్డర్ కాపీ చూపాలని డిమాండ్ చేశారు.

వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవమైతే ఇక్కడే రాజీనామా చేసి వెళ్లిపోతానన్న కేటీఆర్ వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోతే భట్టి విక్రమార్క రాజీనామా చేయాలని డిమాండ్  చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడుతూ... కేటీఆర్ సత్యదూరమైన మాటలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. స్త్రీ నిధి పథకం కింద రూ. 57 వేల కోట్లు ఇప్పటి వరకు అందించామని వివరించారు. ఇప్పటివరకు రూ. 1121 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు అందించామని సూచించారు.