calender_icon.png 4 February, 2026 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్ విచారణతో డైవర్షన్ గేమ్

04-02-2026 03:30:59 PM

  1. సీఎం బాగోతం బయటపడింది
  2. రేవంత్ సీఎం కాదు.. అతన్ని ఒకరు నడిపిస్తున్నారు
  3. సిట్ విచారణతో డ్రామా

హైదరాబాద్: సిట్ విచారణతో డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బాగోతం బయటపడిందని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి.. బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చిందని తెలిపారు. దివాలా తీసిన ఇన్ ఫ్రా సంస్థకు రూ. 6 వేల కోట్లు టెండర్ల ఇచ్చారని పేర్కొన్నారు. ఇన్ ఫ్రా కంపెనీలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులున్నాయన్నారు.

రేవంత్ రెడ్డి సీఎం కాదు.. అతనిని ఒకరు నడిపిస్తున్నారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  సిట్ విచారణ పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. గతంలో రేవంత్ రెడ్డిపై ఐటీ సోదాలు(IT raids) జరిగాయని గుర్తుచేశారు. వరుసగా విచారణ చేస్తుంటే అనుమానం వచ్చిందన్నారు. ఆరా తీస్తే సీఎం రేవంత్ రెడ్డి బాగోతం బయటపడిందని కేటీఆర్ వెల్లడించారు. 2023లోనే కేఎల్ఎస్ఆర్ సంస్థ(KLSR company) దివాలా తీసిందని కేటీఆర్ వెల్లడించారు. దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రూ. 6 వేల కోట్ల పనులు ఇచ్చారని తెలిపారు. దివాలా తీసిన కంపెనీకి ఎందుకు పనులు ఇచ్చారని సుప్రీంకోర్టు నోటీసులు(Supreme Court notices) ఇచ్చిందని వివరించారు.

సుప్రీంకోర్టు అడగడంతో విచారణ చేయాల్సివచ్చిందన్నారు. బినామీ బాగోతం బయటకు రాకుండా చేయాలనే సిట్ విచారణతో డ్రామా చేస్తున్నారని చెప్పారు. దివాలా తీసిన కంపెనీకి రూ. వేల కోట్ల టెండర్లు ఎందుకు ఇచ్చారు?అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్(Kodangal) లోనే కంపెనీకి అనేక పనులు ఇచ్చారని తెలిపారు. దివాలా తీసిన కంపెనీకి బ్యాంక్ గ్యారెంటీలు ఎలా వచ్చాయో.. ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి కారు.. ఎన్నికల సమయంలో డబ్బు ఇచ్చినందుకేనా కాంట్రాక్టులు ఇచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు.