12 June, 2026 | 5:29 PM

Breaking News

వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •   యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధులను మంజూరు చేయండి   •  

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే.. ఊరుకోం: కేటీఆర్

12-06-2026 04:08 PM
  1. నెహ్రూ రికార్డును మోదీ తిరగరాస్తే... సామాన్యుడికి ఏం జరిగింది?
  2. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాలు పెంచాలి
  3. జలిమి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో  చూడాలి
  4. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా?
  5. మోదీ 12 ఏళ్ల పాలన.. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది శూన్యం

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill) తెస్తుందన్న సమాచారం ఉందని కేటీఆర్ అన్నారు. దేశం మొత్తం కాకున్నా.. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాలు పెంచాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ జరిగితే చాలా మార్పులు వస్తాయి.. ఎవరెక్కడ పోటీ చేస్తారో చెప్పలేమని కేటీఆర్ వెల్లడించారు. జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలని కేటీఆర్ పేర్కొన్నారు.

డీలిమిటేషన్ లో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకునేది లేదన్నారు. మంచి పనితీరు కనబరచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేస్తే.. ఊరుకోమని హెచ్చరించారు. జవాహర్ లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) రికార్డును మోదీ తిరగరాస్తే.. సామాన్యునికి ఏం జరిగింది? అని ప్రశ్నించారు. మోదీ 12 ఏళ్లలో చేసిన మంచి పనులు ఏంటో చెప్తే అభినందిస్తామని చెప్పారు. మోదీ 12 ఏళ్ల పాలనలో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది శూన్యమని కేటీఆర్ పేర్కొన్నారు.