13 June, 2026 | 2:14 AM

కేరళం మోడల్ గంజాయి స్మగ్లింగ్

13-06-2026 12:00 AM
  1. బ్యాంకాక్ నుంచి ముంబైకి వచ్చిన మహిళ హర్షసన్నీ
  2. ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
  3.    11 కేజీల గంజాయి స్వాధీనం, 11.82 కోట్ల విలువ

ముంబై, జూన్ 12: కేరళంకు చెందిన ఓ మహిళా మోడల్ శుక్రవారం గంజాయి స్మ గ్లింగ్ చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో పోలీసులకు పట్టుబడింది. ఆమె బ్యాగ్‌లో మొత్తం 11 కేజీల గంజాయి గల 12 ప్యాకెట్లను స్వాధీ నం చేసుకోగా, దాని విలువ రూ.11.82 కో ట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేరళంకు చెందిన మోడల్, నటి హర్షసన్నీ(28) బ్యాం కాక్ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.

ఎయిర్‌పోర్ట్‌లో ఆమె ప్రవర్తన, ఆందోళనను గమనించిన కస్టమ్స్ అధికారులు వెంటనే ఆమె వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేశారు. ఆ బ్యాగులో ప్యాక్ చేసిన 12 ప్లాస్టిక్ ప్యాకెట్లు కనిపించాయి. వాటిలో పచ్చటి పదార్థం ఉంది. వెంటనే అధికారులు ‘ఎన్‌డీపీఎస్’ కిట్‌లో కెమికల్ టెస్ట్ చేయగా, అది అత్యంత ఖరీదైన, నాణ్యమైన ‘హైడ్రోపోనిక్ మారిజువానా’ (గంజాయి) అని తేలింది.

ఆ ప్యాకెట్ల బరువు 11 కేజీలుండగా, విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.11.82 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద అదుపులోకి తీసుకొని ముంబై కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.